: ఢిల్లీలో క్లినిక్‌లోనే వైద్యుడ్ని తుపాకీతో కాల్చి చంపేశాడు
ఢిల్లీలో ఓ వైద్యుడ్ని ఆయన క్లినిక్‌లోనే తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు ఓ వ్యక్తి. అక్కడి పాలం ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. వ్యక్తిగత తగాదాల కారణంగానే వైద్యుడిపై ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న రాత్రి క్లినిక్‌లోని పనులు ముగించుకొని వైద్యుడు బల్వంత్ సింగ్(61) ఇంటికి బయలుదేరబోయే సమయంలో ఒక్కసారిగా ఓ వ్యక్తి ప్రవేశించి కాల్పులు జరిపాడు. దీంతో బల్వంత్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. బల్వంత్ సింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, తన సోదరులతో విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.