: ఈ పాటలో మహేష్ బాబు సూపర్ గా ఉన్నాడు తెలుసా?: సమంత
'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ బాబు లుక్ కి ఆ చిత్ర బృందం ఫిదా అయిపోతోంది. సినిమాలో మహేష్ బాబు యంగ్ లుక్ తో మరింత అందంగా కనిపించాడని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక మహేష్ బాబుతో కలసి మూడోసారి కథానాయకగా ఈ 'బ్రహ్మోత్సవం'లో నటించిన సమంత...గత సినిమాల్లో కంటే మహేష్ చాలా అందంగా ఉన్నాడని, 'బాలా త్రిపురమణి' పాటలో అయితే మహేష్‌బాబు 24 ఏళ్ల అబ్బాయిలా చాలా అందంగా కనిపించాడని మురిసిపోతోంది. 'బాలా త్రిపురమణి' పాట మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ పాటపై చిత్ర బృందం...మిక్కీ జె. మేయర్, సమంత, కాజల్, జయసుధ, నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి ప్రశంసలు కురిపించారు. ఈ పాటను కారులో మళ్లీ మళ్లీ వింటున్నానని, మిక్కీ జె మేయర్ మంచి సంగీతం అందించారని సమంత చెబుతోంది.