: పార్టీ మారను, కాంగ్రెస్ లో చేరను... అంతా దుష్ప్రచారమన్న నాగం


తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లోకి లేదా తెరాసలోకి వెళ్లే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని అన్నారు. తాను ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ వచ్చానని, ఆ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్న తాను అదే పార్టీలోకి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. కాగా, కొన్నాళ్లుగా బీజేపీకి నాగం దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News