: ఆదిలాబాద్‌లో విషాదం.. గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి


ఆదిలాబాద్ జిల్లా మంద‌మ‌ర్రిలో విషాదం చోటుచేసుకుంది. గ‌న్ మిస్‌ఫైర్ కావ‌డంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ గన్ మిస్‌ఫైర్ అయ్యింది. దీంతో అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ గంగాధర్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది గంగాధర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గంగాధ‌ర్ మృతి చెందాడు.

  • Loading...

More Telugu News