: పాలేరు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెర... ఎల్లుండే పోలింగ్.. భారీగా కేంద్ర బలగాల మోహరింపు
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పాలేరు ఉప ఎన్నికలకు ప్రచారం నేటితో ముగియనుంది. పాలేరు వేదికగా గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పేలుతోన్న మాటల తూటాలకు నేటితో బ్రేక్ పడనుంది. ఈనెల 16న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగడానికి పాలేరులో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఈ సందర్భంగా పాలేరులోని పలు ప్రాంతాల్లో బలగాలు పెరేడ్ నిర్వహించాయి. పోలింగ్ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.