: 'అవును... షూట్ చేశా'... నేరాన్ని అంగీకరించిన రాకీ యాదవ్!
ఈ నెల 7వ తేదీన బీహార్ లో ఆదిత్య సచ్ దేవ్ అనే యువకుడిని తానే కాల్చి చంపినట్టు, బీహాల్ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తన రేంజ్ రోవర్ కారులో రాకీ వెళుతుండగా, సుజుకి స్విఫ్ట్ నడుపుకుంటూ వస్తున్న ఆదిత్య దాన్ని ఓవర్ టేక్ చేయగా, ఆగ్రహంతో రాకీ, తన వద్ద ఉన్న గన్ తీసి కాల్చాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత తాను బీహార్ లో లేనని, కాల్చింది తాను కాదని బుకాయించిన రాకీ, ఆపై పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.