: సవాల్ విసిరిన అంబటి రాయుడు... ఛాలెంజ్ ను స్వీకరించిన పొలార్డ్!
కీరన్ పొలార్డ్... ఆరడుగులా ఐదంగుళాల ఎత్తు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చేజిక్కిన బంతిని సునాయాసంగా బౌండరీని దాటించే బలం అతని సొంతం. అతనికి తెలుగోడు, ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో ఆడుతున్న అంబటి రాయుడు ఓ సవాల్ విసిరాడు. గత బుధవారం నాడు రాయల్ చాలెంజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తన బ్యాటుతో 108 మీటర్ల దూరానికి బంతిని బాదిన రాయుడు, అదే బ్యాటును పొలార్డ్ కు పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చి, తనకంటే ఎక్కువ దూరం బంతిని బాదుతావా? అని సవాల్ విసిరాడు. రాయుడి సవాల్ ను స్వీకరిస్తున్నానని సామాజిక మాధ్యమాల ద్వారా పొలార్డ్ చెప్పాడు. ఇక పొలార్డ్ ఎప్పుడు 108 మీటర్ల కన్నా ఎక్కువ దూరానికి బంతిని పంపుతాడో!