: ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే జగన్ దీక్షకు మద్దతివ్వండి: టీడీపీకి అంబటి సవాల్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై టీడీపీకి చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే కనుక తమ పార్టీ అధనేత జగన్ తో పోరాటానికి కలిసిరావాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రజాసమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న దీక్షకు మద్దతివ్వాలని ఆయన సవాల్‌ విసారారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ అధినేత జగన్‌ చిత్తశుద్ధితో దీక్ష చేస్తుంటే టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేమని, అందుకే ఆ రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ తో టీడీపీ లోపాయకారీ ఒప్పందం చేసుకున్నందునే తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News