: ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలూ 'హైదరాబాదు'లు అయిపోవు: జగన్ కు సోమిరెడ్డి కౌంటర్


ప్రత్యేక హోదావల్ల ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు హైదరాబాదులుగా మారిపోతాయని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పినట్టు జరగదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాము మిత్రపక్షంగానే ఉన్నామని, బీజేపీతో పోరాడి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు. ప్రత్యేకహోదా కలిగి ఉన్న 11 రాష్ట్రాలలో అద్భుతమైన డెవలెప్ మెంట్ జరిగిపోలేదని ఆయన చెప్పారు. అయితే హోదా వస్తే రాష్ట్రానికి పన్నురాయతీలు వస్తాయని ఆయన చెప్పారు. దాని వల్ల పెట్టుబడులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కానీ 13 జిల్లాలు హైదరాబాదులైపోవని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానాలని ఆయన ఇతర పార్టీలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News