: అసలు తిండే లేనప్పుడు.. మరుగుదొడ్లు ఎందుకు?: ప్రధానిపై మండిపడ్డ కేరళ సీపీఎం నేత


తినడానికి తిండే లేనప్పుడు మరుగుదొడ్లు కట్టి ఏం చేస్తారంటూ ప్రధాని నరేంద్ర మోదీపై కేరళ సీపీఎం సీనియర్ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్ మండిపడ్డారు. ఎంతసేపూ స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడే మోదీ, దేశంలో చాలా మందికి తినడానికి తిండి కూడా లేదన్న విషయాన్ని మొదట గుర్తించాలన్నారు. తిండి లేనప్పుడు మరుగుదొడ్లు కట్టుకుని ఏం చేస్తామని ప్రశ్నించారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మోదీ నోట శౌచాలయం మాట తప్పా వేరే వినపడటం లేదంటూ విమర్శించారు. కాగా, త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీపీఎం తరపున అచ్యుతానందన్, విజయన్ లు ఎన్నికల ప్రచారబాధ్యతలను తీసుకున్న విషయం తెలిసిందే. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తలనొప్పి తెచ్చిపెట్టాయి. శిశుమరణాల శాతం విషయంలో కేరళ రాష్ట్రాన్ని సోమాలియాతో పోలుస్తూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News