: 16 నుంచి హైదరాబాద్ లో ఆటోలు బంద్
ఈ నెల 16 నుంచి హైదరాబాద్ లో తిరిగే ఆటోలు ఆగిపోనున్నాయి. హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ యంత్రాంగం తీరుకు నిరసనగా బంద్ కు పిలుపు నిచ్చినట్లు యూనియన్ల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆటో యూనియన్లు ఒక ప్రకటన చేశాయి. తమపై ట్రాఫిక్, రవాణా, తూనికలు, కొలతల అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు నోటీసులు అందజేశామన్నారు. సంబంధిత శాఖల వేధింపుల కారణంగానే తాము ఆటోల బంద్ కు పిలుపునిచ్చామని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.