: భావ ప్రకటనా స్వేచ్ఛకూ పరిమితులుంటాయి: సుప్రీం
భావ ప్రకటన స్వేచ్ఛకూ కొన్ని పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 499, 500ల కింద రెండేళ్లు జైలు శిక్ష విధించే నిబంధనను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ను విచారించిన అనంతరం సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకూ కొన్ని పరిమితులుంటాయని, ప్రసంగం చేసే స్వేచ్ఛ పూర్తిస్థాయిలో ఉండబోదని తెలిపింది. మాట్లాడే, భావప్రకటన చేసే హక్కు పేరిట ఒకరి కీర్తిని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. కాబట్టి పరువు నష్టం దావా ఇండియన్ పీనల్ కోడ్ కిందకే వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నతమైన అంశమేనని, అయితే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో వ్యక్తిగత హక్కులను రక్షించిండం ఒక భాగమని గుర్తుచేసింది.