: ట్యాంకర్ నేల'పాలు'... పాలతో రైతుల స్నానాలు!
ఒక ట్యాంకర్ పాలు నేల పాలైన సంఘటన, పాల రైతుల నిరసనలో చోటుచేసుకుంది. ఒడిశా పాల సమాఖ్య తమను నిర్లక్ష్యం చేస్తోందంటూ పాల రైతులు ఆందోళనకు దిగిన సంఘటన బారాగఢ్ జాతీయ రహదారిపై జరిగింది. అదే సమయంలో, అటుగా వస్తున్న ఒక పాల ట్యాంకర్ ను రైతులు అడ్డుకున్నారు. ట్యాంకర్ ట్యాప్ విప్పి పాలను రోడ్డుపైకి వదిలేశారు. ట్యాంకర్ ట్యాప్ కింద కూర్చుని కొంతమంది పాలరైతులు పాల స్నానం చేశారు. ఈ సంఘటనలో సుమారు 30 వేల లీటర్ల పాలు నేలపాలై పోయాయి.