: అగ్రిగోల్డ్ కేసులో సంచలన మలుపు... పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు రూ. 1.5 కోట్లు లంచం ఇవ్వజూపిన చైర్మన్, డైరెక్టర్లు


తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు, కన్నడనాట పెను సంచలనాన్ని సృష్టించింది. సంస్థ చైర్మన్, డైరెక్టర్లు ఉడిపి కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు రూ. 1.5 కోట్లు లంచం ఇవ్వజూపారట. ఈ విషయాన్ని పీపీ స్వయంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్ లో కన్నడవాసులు కూడా వందల సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు. వీరి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని యోచిస్తుండగా, అగ్రిగోల్డ్ పై కేసు ఉడిపి కోర్టులో నడుస్తోంది. తనను లోబరచుకునేందుకు భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ, పీపీ ప్రభుత్వానికి, కోర్టుకు కొద్దిసేపటి క్రితం నివేదికను అందించారు. ఇక ఈ కేసు తదుపరి ఎటువంటి మలుపులు తిరుగుతుందో!

  • Loading...

More Telugu News