: చైనా సైన్యంలో పూర్తిస్థాయి మార్పులు.. మరింత పటిష్టమయ్యేలా ప్రణాళికలు
చైనా తన సైన్యంలో పూర్తిస్థాయిలో మార్పులు తేనుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత సైన్యంతో ఇప్పటికే బలంగా ఉన్న చైనా సైన్యం మరింత పటిష్టమయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. 2020నాటికి తన సైన్యంలోని అన్ని విభాగాల్లో సమూల మార్పులు చేయాలని చూస్తోంది. మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోనుంది. దీనిలో భాగంగా ఆయుధాల పెంపు, యుద్ధ నైపుణ్య శిక్షణ అంశాలపై దృష్టి పెట్టింది. ఈమేరకు నిన్న ఐదు సంవత్సరాల మిలటరీ డెవలప్ మెంట్ ప్లాన్‌ను ఆ దేశ సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) ఆవిష్కరించింది. తన సైన్యం శాఖలను కొత్తగా 15 ఏజన్సీలుగా విభజించనున్నట్లు సీఎంసీ తెలిపింది.