: కేసీఆర్ వైఖరితో తీవ్ర అన్యాయం: మండిపడ్డ బొత్స
గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు ఆనకట్టలు కట్టుకుంటూ పోతే, రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిగా మారే ప్రమాదముందని అన్నారు. ఈ వైఖరిని ఎండగట్టేందుకు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు తమ నేత వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.