: సుప్రీంలో న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి.. బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లావు నాగేశ్వరరావు


ఈరోజు నలుగురు న్యాయమూర్తులను నియ‌మించ‌నున్న‌ట్లు నిన్న‌ సుప్రీంకోర్టు ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొద్ది సేప‌టి క్రితం తెలుగు వ్య‌క్తి, మాజీ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎల్‌.నాగేశ్వరరావు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జ‌స్టిస్ నాగేశ్వ‌రావు గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వ్య‌క్తి. నాగేశ్వ‌రరావుతో పాటు మ‌ధ్యప్ర‌దేశ్ హైకోర్టు నుంచి జస్టిస్‌ ఎఎం ఖాన్‌విల్కర్‌, అలహాబాద్‌ హైకోర్టుకు నుంచి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, కేరళ హైకోర్టుకు నుంచి జస్టిస్‌ అశోక్‌ భూషణ్ సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, తెలుగు వ్య‌క్తి జ‌స్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News