: చీ...ఛీ...ఇదేం పద్దతి...?: నావికాదళాధికారుల భార్యల 'మార్పిడి' కేసుపై ప్రత్యేక దర్యాప్తుకు సుప్రీం ఆదేశం


భారతనావికాదళాధికారులపై నమోదైన కేసును విచారించిన సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... కొచ్చి సైనిక స్థావరంలో తన భర్త కంటే పైస్థాయి అధికారి తనను అతని వద్దకు పంపించాలంటూ తన భర్తను కోరారని, అతను తిరస్కరించడంతో తన భర్తను సీనియర్ అధికారి బెదిరించారని పేర్కొంటూ ఓ నేవల్ కమాండర్ భార్య ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విచారించి చర్యలు తీసుకుంటామని అప్పటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం కేసులో విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. 'ఇదేం సంస్కృతి?' అంటూ మండిపడింది. నేవీలో ఉన్నత స్థాయి అధికారులు సరదా కోసం భార్యలను మార్చుకుని శృంగారానందం పొందుతారట. దీనిని జూనియర్లకు సంస్కృతిగా పరిచయం చేస్తారట. దీనికి అంతా అంగీకరించాల్సిందేనట. అంగీకరించకపోతే వేధింపులను భరించాల్సిందేనని డిఫెన్స్ కు చెందిన పలువురు పేర్కొంటుంటారు. దీంతో ఈ కేసును విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కొచ్చిలో నావికాధికారులు భార్యల మార్పిడి శృంగారంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News