: పనామా పేపర్స్ లో ఈసారి హాలీవుడ్ హ్యారీ పోటర్ నటి


పనామ పేపర్స్ జాబితా వివిధ దేశాల్లో కలకలం రేపుతోంది. పన్ను ఎగవేసేందుకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో కంపెనీలు స్థాపించినట్టు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఆ మొత్తాన్ని దారిమళ్లించారంటూ పలువురు పెద్దల పేర్లను పనామా పేపర్స్ బట్టబయలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ పేరు ఉండడంతో భారతీయ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. తాజాగా హాలీవుడ్ 'హ్యారీ పోటర్' సిరీస్ లో నటించిన ఎమ్మా వాట్సన్ (26) పేరు కూడా బట్టబయలైంది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ, తాము సంస్థను ఏర్పాటు చేసింది వాస్తవమేనని, అయితే అది పన్ను ఎగవేసేందుకు కాదని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News