: 103 దేశాల్లోని 3 వేల నగరాల్లో కాలుష్యాన్ని వెదజల్లే టాప్ 4 నగరాలు మనవే!
భారతదేశం కాలుష్య కాసారంగా మారుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, గత ఏడాది ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారకమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ ఈ ఏడాది 9వ స్థానంలో నిలవగా, గతఏడాది ఈ జాబితాలో స్థానం కూడా పొందని గ్వాలియర్, అహ్మదాబాద్, పట్నా, రాయ్ పూర్ నగరాలు ఈ ఏడాది అత్యంత కాలుష్య కారక నగరాల్లో తొలి ఐదు స్థానాల్లో వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఇక, అగ్రస్థానంలో ఇరాన్ లోని జాబోల్ నగరం నిలిచింది. అత్యంత కాలుష్య కారక నగరాలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 103 దేశాల్లోని 3 వేల నగరాల గాలిలో ఉండే పర్టిక్యులేటర్ మాటర్ కొలమానాన్ని ప్రమాణంగా తీసుకుంది. గత ఏడాది కేవలం 1600 నగరాలను మాత్రమే పరిశీలించగా, ఈ ఏడాది వాటి సంఖ్యను సుమారుగా రెట్టింపు చేయడం విశేషం. పట్టణాల్లో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండెకు సంబంధించిన పలు రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.