: మహానాడుకు ఐదు రాష్ట్రాల నుంచి 30 వేల మందికి ఆహ్వానం


త్వరలో నిర్వహించనున్న 'మహానాడు'కు ఐదు రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఈరోజు తిరుపతిలో జిల్లా టీడీపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, అతిథులకు గదులు, భోజనాలు, ఇతర ఏర్పాట్లపై ఆయన చర్చించారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు అతిథి గృహాలను ఈ నెల 20వ తేదీలోగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లోని ముప్ఫై వేల మందిని మహానాడుకు ఆహ్వానిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News