: సాధువుల 'అఖాడా' ఎన్నికల్లో రెండు వర్గాల ఘర్షణ... తుపాకి కాల్పుల్లో సాధువులకు గాయాలు


సింహస్థ కుంభ మేళా సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగిన సాధువుల అఖాడా ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మరో వర్గం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఆరుగురు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన సాధువులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు అనుమానిత సాధువులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అఖాడాలో పలు స్థాయి పోస్టుల కోసం ఈ ఎన్నికలు జరిగాయని, ఎటువంటి కాల్పులు జరగలేదని చెబుతున్నారు. గాయపడ్డ సాధువుల శరీరాలపై కేవలం త్రిశూలాల గాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, పోలీసుల వాదనను సాధువులు ఖండిస్తున్నారు.

  • Loading...

More Telugu News