: భారతీయులకు ఇద్దరు తల్లులు: మోహన్ భగవత్
'భారత్ మాతాకీ జై' నినాదంపై తీవ్ర చర్చలు నడిచిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పదించారు. భారతీయులకు ఇద్దరు తల్లులు ఉంటారని అన్నారు. ఒకరు కన్నతల్లి అయితే, రెండోది భారత్ మాత అని ఆయన సెలవిచ్చారు. ఉజ్జయినిలోని క్షిప్ర నది ఒడ్డున జరుగుతున్న సింహస్ధ కుంభమేళాలో ప్రారంభమైన మూడు రోజుల విచార్ మహా కుంభ్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ జీవించడానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ భారతమాత తన ఒడిలోకి తీసుకుంటుందని అన్నారు. ఈ సదస్సులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాలుపంచుకోవడం విశేషం.