: ఏపీ మంత్రి రావెలకు చేదు అనుభవం!


ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుకు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ వసతి గృహంపై ఈరోజు నిర్వహించిన వర్క్ షాప్ కు హాస్టల్ వార్డెన్లు హాజరయ్యారు. ప్రభుత్వ హాస్టళ్లను ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలంటూ మంత్రిని ఈ సందర్భంగా వారు నిలదీశారు. ఊహించని సంఘటనతో కంగుతున్న మంత్రి రావెల సమాధానం చెప్పకుండానే వెనుదిరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News