: ఆ ముగ్గురూ... మూడు కోతులు మాదిరి వ్యవహరిస్తున్నారు : సీపీఐ నేత నారాయణ
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు అనే మూడు కోతులు మాదిరిగా ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో విలేకరులతో ఆయన మాట్ల్లాడుతూ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలని సూచించారు. తమిళనాడు రాజకీయాల గురించి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.