: సినీ నిర్మాతలు, వాహన యజమానుల మధ్య వివాదానికి ముగింపు


డిమాండ్ కు తగ్గట్లుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని సినిమా నిర్మాతలు పేర్కొన్నారు. సినీ నిర్మాతలు, వాహన యజమానుల మధ్య వివాదానికి తెరపడింది. ఈ విషయమై గత మూడు రోజులుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్ లు బాగానే జరుగుతున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News