: రైతుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు: వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి
రాజకీయాల కోసం చంద్రబాబు, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. జల వివాదాలు వస్తాయనే విషయాన్ని రాష్ట్ర విభజన జరగక ముందే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని, అయినా, ఎవరూ పట్టించుకోలేదన్నారు. కాగా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూల్ కేంద్రంగా జగన్ దీక్ష చేపట్టనున్నారు.