: బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేస్తోంది: జైరాం రమేష్
బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు భేటీ అయిన సందర్భంగా జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ... విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. రెండేళ్లుగా ఇదే తీరును కనబరుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో విఫలం చెందిందని ఆయన విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.