: మంత్రి వర్గ నిర్ణయం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించవచ్చు: దిగ్విజయ్
మంత్రి వర్గ నిర్ణయం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మీడియాతో మాట్లాడుతూ... ఏపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు బీజేపీ మద్దతివ్వాలని అన్నారు. రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని అన్నారు. ఇంకా విఫలమవుతూనే ఉందని ఆయన అన్నారు.