: సాయిబాబాపై చర్చలో క్రిస్టియన్, ముస్లిం మతాలపై రమణానంద సంచలన వ్యాఖ్యలు
ఓ తెలుగు టెలివిజన్ చానల్ లో 'స్వాముల లడాయి' పేరిట సాయిబాబాపై జరుగుతున్న చర్చ పర మతాలపై వ్యాఖ్యల దిశగా సాగుతూ పక్కదారి పట్టింది. సాయిబాబా దైవత్వాన్ని నిరూపిస్తానంటూ వచ్చిన రమణానంద మహర్షి, దాన్ని సవాలు చేస్తున్న పంపా పీఠాధిపతి శ్రీ గోవిందానందల మధ్య రెండున్నర గంటలుగా జరుగుతున్న చర్చలో రమణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ మతస్తులు కొలిచే ఏసుక్రీస్తు శివ స్వరూపమని, ముస్లింలు కొలిచే అల్లా కూడా శివుడేనని, మరే ఇతర దేవుడైనా శివుడేనని, మరే మతమూ తమకు సమ్మతం కాదని అన్నారు. 'అల్లా అంటే అల్... అహ్...' అంటూ రమణానంద ఏదో చెప్పబోగా, గోవిందానంద అడ్డుకుని ఆ పదాలు ఏ భాష నుంచి వచ్చాయి? పర్షియనా? గల్ఫా?, ఉర్దూనా? అంటూ ప్రశ్నించడంతో రమణానంద సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది.