: జూలై 29 నుంచి 10 లక్షల బ్యాంకు శాఖల నిరవధిక సమ్మె


కేంద్రం నిర్ణయాలతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, రుణాలు ఎగ్గొడుతున్న కార్పొరేట్ల నుంచి వాటిని వసూలు చేయడంలో సహకరించడం లేదని ఆరోపిస్తూ, దేశంలోని తొమ్మిది బ్యాంకింగ్ యూనియన్లూ జూలై 29 నుంచి సమ్మెకు దిగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో సమావేశమైన యునైడెట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం వెల్లడించారు. ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్బీఈఎఫ్, ఐఎన్బీఓసీ, ఎన్ఓబీడబ్ల్యూ, ఎన్ఓబీఓ యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని, దేశవ్యాప్తంగా 10 లక్షల బ్యాంకు శాఖలు మూతపడనున్నాయని వివరించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాలు విక్రయించాలని చూడటం, కొత్త బ్యాంకులకు ఇబ్బడి ముబ్బడిగా లైసెన్సులు ఇవ్వడం, బ్యాంకుల విలీనం వంటి చర్యలతో వ్యవస్థ ప్రమాదంలో పడిందని అన్నారు. బ్యాడ్ లోన్స్ రూ. 10 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేస్తూ, వీటిని ఎగ్గొట్టిన వారి నుంచి డబ్బు కక్కించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేవలం 7 వేల మంది డిఫాల్టర్ల కారణంగా రూ. 60 వేల కోట్లను బ్యాంకులు నష్టపోయాయని తెలిపారు. దీన్ని నిరసిస్తూ సమ్మెకు నోటీసు ఇచ్చినట్టు వెంకటాచలం తెలిపారు.

  • Loading...

More Telugu News