: నేడు హైదరాబాద్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనున్న సన్ రైజర్స్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో సన్‌రైజర్స్ టీమ్ తలపడనుంది. ఈరోజు రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్-9 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను మించి రాణిస్తూ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో డేర్‌డెవిల్స్ ఐదో స్థానంలో ఉంది. బలంగా కనిపిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తో పోరాడి నిలబడాలంటే ఢిల్లీ టీమ్ కష్టపడాల్సిందే. అయితే ఎప్పుడు చెలరేగుతుందో తెలియని ఢిల్లీ టీమ్ ను తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.