: ప్రభుత్వాన్ని ఒక్కో అడుగూ ఆక్రమిస్తున్న న్యాయ వ్యవస్థ: సరికాదని జైట్లీ సంచలన వ్యాఖ్య


ప్రభుత్వాన్ని, పాలనా వ్యవస్థనూ నెమ్మది నెమ్మదిగా న్యాయ వ్యవస్థ ఆక్రమిస్తోందని, ఇది దేశ భవిష్యత్తు పట్ల ప్రమాద ఘంటికలు మోగుతున్న సంకేతాలను సూచిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఒక్కో అడుగూ, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ, భారత లెజిస్లేచర్ ను న్యాయవ్యవస్థ నాశనం చేస్తోంది" అని రాజ్యసభలో జైట్లీ అన్నారు. కేటాయింపు నిర్ణయాలు, పన్నుల వసూలు అధికారం ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలని, దాన్ని న్యాయవ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండా ఎంపీలు రక్షించాల్సి వుందని అన్నారు. జీఎస్టీ బిల్లుపై మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదని, అది దుస్సాహసాల దిశగా సాగరాదని అన్నారు. ఫైనాన్షియల్ పవర్ తదితరాల్లో ఇప్పటికే చాలా వరకు న్యాయవ్యవస్థ పరిధిలోకి వెళ్లిపోయాయని, పన్నుల పరిధి మాత్రమే రాష్ట్రాల వద్ద ఉన్నదని అన్నారు. ఇక దీన్ని కూడా న్యాయ వ్యవస్థ చేతుల్లోకి పంపాలన్నదే మీ ప్రతిపాదనా? అని కాంగ్రెస్ పై జైట్లీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News