: నటుడు గిరిబాబు భార్య కన్నుమూత


ప్రముఖ తెలుగు చిత్రాల నటుడు గిరిబాబు సతీమణి ఎర్ర శ్రీదేవి గత అర్ధరాత్రి మరణించారు. సుమారు మూడు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రఘుబాబు నటుడిగా రాణిస్తున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని స్వగ్రామమైన ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు కుటుంబానికి సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News