: రూ. 9,999కి ఐబాల్ ల్యాప్ టాప్
ప్రముఖ టెక్ ఉత్పత్తుల సంస్థ ఐబాల్, భారత మార్కెట్లోకి రూ. 9,999 ధరతో సరికొత్త ల్యాప్ టాప్ ను కాంప్ బుక్ ఎక్సలెన్స్ పేరిట విడుదల చేసింది. ఆన్ లైన్ రిటెయిలర్ ల ద్వారా వచ్చే వారం నుంచి వీటి అమ్మకాలను ప్రారంభిస్తామని ఐబాల్ వెల్లడించింది. 11.6 అంగుళాల హెచ్డీ డిస్ ప్లేతో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో 4 కోర్ ఆటమ్ జడ్ ప్రాసెసర్, 2 జీబీ డీడీఆర్ 3 రామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ సౌకర్యాలు ఇందులో ఉన్నాయని, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుందని తెలిపారు. వైఫై, రెండు యూఎస్బీ పోర్టులు, బ్లూటూత్, 31 గంటల స్టాండ్ బైతో నిలుస్తుందని వెల్లడించింది. దీంతో పాటు 14 అంగుళాల స్క్రీన్ తో కాంప్ బుక్ ఎక్సెంప్లేర్ పేరిట రూ. 13,999 ధరలో మరో ల్యాప్ టాప్ ను విడుదల చేస్తున్నట్టు ఐబాల్ వెల్లడించింది.