: టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ!... ప్రకాశం జిల్లాలో హైటెన్షన్, పలువురికి తీవ్ర గాయాలు


ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జిల్లాలోని పరుచూరు మండలం ఇనగల్లులో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు చెందిన కార్యకర్తల మధ్య పెను ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రోడ్ల మీదకు వచ్చి పరస్పరం భౌతిక దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలు మరింత మేర విస్తరించకుండా అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటైంది. ఘర్షణకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News