: ఎంపీల పట్ల ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది దురుసు వర్తన!... రాజ్యసభలో టీఎస్ఆర్ ఆవేదన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్ది నిన్న పార్లమెంటులో ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది ఎంపీల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభలో ఆయన లేవనెత్తిన అంశం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇటీవల ప్రధాని విశాఖకు వచ్చిన సందర్భంగా తన పట్ల ఎస్పీజీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని భద్రతా సిబ్బంది విధి నిర్వహణను తాను ప్రశ్నించదలచుకోలేదన్న టీఎస్సార్... ఎంపీల పట్ల మాత్రం వారు ఎలా దురుసుగా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. దీనిపై తాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చానని కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపై సభలో కొద్దిసేపు జరిగిన చర్చలో అధికార, విపక్షాల మధ్య వాగ్వుద్ధం చోటుచేసుకుంది.