: ఆ సినిమా సెట్ లో ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు: అలియా భట్


బాలీవుడ్ యువ కథానాయికలలో అలియా భట్ కు అభిమానుల్లో విశేషమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే... అలాంటి అలియా భట్ ను స్పాట్ లో ఎవరూ గుర్తించలేదంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే. అయితే ఈ విషయం ఆమే స్వయంగా వెల్లడించింది. షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాను అభిషేక్ చౌబే రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బీహార్ కు చెందిన పేద యువతిగా డీగ్లామరైజ్ పాత్రలో నటిస్తోంది. దీంతో సినిమా షూటింగ్ చూసేందుకు వచ్చిన వారెవరూ ఆమెను పట్టించుకునేవారు కాదట. ఆమె మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత ఆమె గొంతును గుర్తుపట్టి అలియా భట్ అని గుర్తించి కాస్త దూరం జరిగేవారని అలియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News