: సచిన్ తో కోహ్లీని పోల్చవద్దు: సెహ్వాగ్


టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చవద్దని మెంటార్, కామెంటేటర్ గా మారిన వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. సచిన్ బ్యాటింగ్ లెజెండ్ అని, కోహ్లీ కరెంట్ రన్ మెషీన్ అని పేర్కొన్న సెహ్వాగ్, వారిద్దరిలో ఎవరి ప్రత్యేకత వారిదని, వారిద్దరినీ కలిపి పోల్చడం దారుణమని అన్నాడు. ఐపీఎల్ సీజన్ లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీని మోస్ట్ డేంజరస్ బ్యాట్స్ మన్ అని సెహ్వాగ్ అభివర్ణించాడు. గత కొన్ని నెలలుగా కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని సెహ్వాగ్ తెలిపాడు. గతంలో ఇలాగే సచిన్, వివ్ రిచర్డ్స్ తో తనను పోల్చేవారని ఈ సందర్భంగా సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.

  • Loading...

More Telugu News