: తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిపై గవర్నర్ రోశయ్య పరువునష్టం దావా


తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పై గవర్నర్ రోశయ్య మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి సీఎం జయలలిత ఇచ్చిన ముడుపులను రోశయ్య తీసుకున్నారని గత నెలలో ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇళంగోవన్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై పరువు నష్టం దావా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

  • Loading...

More Telugu News