: మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలి...సుష్మ బాగా పని చేస్తున్నారు: కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోదీపై విమర్శలు గుప్పించి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను పొగడ్తల్లో ముంచెత్తడం ఆసక్తి రేపుతోంది. ఉత్తరాఖండ్ లో రాజ్యాంగానికి విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి విఘాతం కలిగించినందుకుగాను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కొంత సేపు విరామమిచ్చిన ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పై ప్రశంసలు కురిపించారు. ఆమె అద్భుతంగా పని చేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. నైజీరియాలో సముద్ర దొంగల చెరలో ఉన్న భారతీయ ఇంజనీర్ సంతోష్ భరద్వాజ్ ను విడిపించడంలో కానీ, ఆయన గురించిన వివరాలు ఆయన కుటుంబ సభ్యులకు అందజేయడంలో కానీ ఆమె అద్భుతమైన పాత్ర పోషించారని అభినందించారు.

  • Loading...

More Telugu News