: 'స్మార్ట్ సిటీస్' పథకంతో ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉంది: లోక్ సభలో బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
'స్మార్ట్ సిటీస్' పథకంతో ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందంటూ బీజేపీ ఎంపీ భోలాసింగ్ లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్మార్ట్ సిటీస్' పథకం డెవలప్ మెంట్ సాధించిన నగరాలకే లాభదాయకమని అన్నారు. అంతేగాక, పశ్చిమ భారత్‌లో డెవలప్ మెంట్ ఉంది కానీ, వివేకం లేదు అని వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా ఈశాన్య భారత్‌కు వివేకం ఉంది కానీ డెవలప్ మెంట్ లేదు అని ఆయన అన్నారు. అంతటితో ఆపేయకుండా ప్రధాని మోదీ గతంలో చేసిన ఇటువంటి వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.