: ఎన్నికల్లో పంచేందుకు డీఎంకే అభ్యర్థి సిద్ధం చేసుకున్న రూ. 2 కోట్లు సీజ్!


మరో వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రతిపక్ష డీఎంకే పార్టీ తరఫున అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కేసీ పళని చామీ ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న 2 కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. పళని చామి, ఆయన కుమారుడు శివరామన్ ఇళ్లలో భారీ ఎత్తున నగదు ఉందన్న పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు దాడులు చేయగా ఈ డబ్బు పట్టుబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల్లో ఖర్చుకు ఉపయోగిస్తున్నారా? అనే కోణాల్లో దర్యాఫ్తు ప్రారంభించినట్టు ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. డీఎంకే అభ్యర్థి పట్టుబడటం ఆ పార్టీకి కొంత ఇబ్బందేనని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్నందున అటు ఆదాయపు పన్ను అధికారులు, ఇటు ఎన్నికల కమిషన్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మంగళవారం నాడు మొత్తం 4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News