: ‘సివిల్స్’లో తెలుగు తేజాలకు జగన్ అభినందనలు
అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ‘సివిల్స్’ కు ఎంపికైన విజేతలకు అభినందనలతో పాటు శుభాకాంక్షలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, సివిల్ సర్వీసులకు ఎంపికైన సుమారు 70 మంది అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం.