: కొడుకు చేసిన నిర్వాకానికి తల్లికి శిక్ష!... ‘ఓవర్ టేక్’ విషయంలో కుర్రాడిని చంపేసిన రాఖీ తల్లిని సస్పెండ్ చేసిన జేడీయూ!


తండ్రి పేరుమోసిన రాజకీయ వేత్త. తల్లి ఎమ్మెల్సీ. ఇంకేముంది, అధికార మదం తలకెక్కిన వారి సుపుత్రుడు తన కారును ఓవర్ టేక్ చేసిన ఓ ఇంటర్ విద్యార్థిని ఫారిన్ మేడ్ పిస్టల్ తో కాల్చేశాడు. ఈ కేసులో పోలీసులకు చిక్కకుండా దాక్కున్న అతడికి ఎట్టకేలకు నిన్న బేడీలు పడిపోయాయి. ఇక కొడుకు చేసిన తప్పుకు ఆ మహిళా ఎమ్మెల్సీపై ఆమె పార్టీ కత్తి దూసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా బీహార్ లోని గయలో ఇటీవల చోటుచేసుకున్న దారుణ ఘటన తదనంతర పరిణామాలు. ఇంటర్ విద్యార్థిని చంపేసిన రాఖీ యాదవ్ జైలు ఊచలు లెక్కిస్తుండగా, అతడి తల్లి జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు నిన్న ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ బీహార్ శాఖ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News