: పాలేరుకు రేవంత్ రెడ్డి పయనం!... కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్న టీ టీడీఎల్పీ నేత!
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి నేడు మరో ఆసక్తికర సన్నివేశం కనిపించనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి విజయం కోసం టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. మరికాసేపట్లో హైదరాబాదులో బయలుదేరనున్న రేవంత్ రెడ్డి నేరుగా పాలేరుకు వెళ్లనున్నారు. బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు... తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు బ్రేకులు వేసేందుకు చేతులు కలిపాయి. ఈ క్రమంలో సుచరితారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన టీ టీడీపీ ఈ ఉప ఎన్నికలో అసలు అభ్యర్థినే బరిలోకి దింపలేదు. తాజాగా టీ టీడీపీలో ముఖ్యనేతగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు సుచరితారెడ్డి తరఫున ప్రచారంలో పాల్లొంటుండటంపై ఆసక్తి నెలకొంది.