: వైఎస్ జగన్ కు పోటీగా ఎమ్మార్పీఎస్ దీక్ష!... కాకినాడలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నిన్న చేపట్టిన ఆందోళనల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన ధర్నాకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో జగన్ మాట్లాడుతుండగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకని జగన్.. ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు. జగన్ దీక్షాస్థలికి ఎదురుగానే మరో శిబిరం వేసుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. వర్గీకరణపై జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్ రావడం కాస్త ఆలస్యం కావడంతో ఎమ్మార్పీఎస్ నేతలను శాంతింపజేసేందుకు వైసీపీ నేతలు చేసిన యత్నాలు ఫలించినా, ఆ తర్వాత మాట్లాడిన జగన్ అసలు వర్గీకరణ ఊసే ఎత్తకపోవడంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News