: గిరిజన దేవత ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా!... మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతం పాడేరుకు వెళ్లారు. పాడేరులోని గిరిజనుల ఇష్ట దైవం మోదకొండమ్మ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదకొండమ్మకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. గడచిన మూడు రోజులుగా జరుగుతున్న మోదకొండమ్మ ఉత్సవాలను గిరిజనులు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గ పరిధిలోనే ఈ ఉత్సవాలు జరుగుతుండటంతో రోజా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తూ, తన వైపు తిప్పుకుంటోందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఎలాంటి అడ్డంకి ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావును కోట్ల కొద్దీ డబ్బు ఇచ్చి తమ వైపు లాగేసుకున్నారని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News