: ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలో తమిళ నటుడు శరత్ కుమార్ పై కేసు నమోదు
కారులో డబ్బు అక్రమంగా తరలిస్తున్న కేసులో తమిళ ఆల్ ఇండియా సమతువా మక్కల్ కట్చి పార్టీ అధినేత, సినీ నటుడు శరత్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆయనపై కేసు నమోదు చేసినట్లు తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 16న జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి శరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితం ప్రచార నిమిత్తం వెళ్లి వస్తుండగా ఆయన కారును పోలీసులు తనిఖీ చేయగా రూ.9 లక్షల నగదు లభించింది. ఇందుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.