: రాజకీయాల్లో వారసత్వాలను నేను సమర్థించను: మంత్రి కేటీఆర్


రాజకీయాల్లో వారసత్వాలను తాను సమర్థించనని, ఒకరి కొడుకుగా, కూతురిగా ఫలానా పదవి కావాలంటే ఇదేదో చాక్లెటో, పిప్పర మెంటో కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు ఆమోదించిన వారే నేత అవుతారని అన్నారు. తన స్థాయికి మంత్రి పదవే ఎక్కువని గతంలోనే చెప్పానని, ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎటువంటి ఆశ లేదన్నారు. రాజకీయాల్లో వయస్సును బట్టి పదవులు రావని, సందర్భాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి పదవులు వస్తాయని పేర్కొన్నారు. పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే తన పదవులకు తప్పకుండా రాజీనామా చేస్తానని కేటీఆర్ మరోమారు పునరుద్ఘాటించారు. ఈ ఉపఎన్నికపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాను చేసిన సవాల్ ను ఆయన స్వీకరించినా, స్వీకరించపోయినా తన మాటపై తాను నిలబడతానని కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు.

  • Loading...

More Telugu News